amp pages | Sakshi

Ind Vs Pak: ‘అక్టోబరు 23న ఇండియాతో పాక్‌ మ్యాచ్‌ ఆడదు’

Published on Thu, 10/20/2022 - 14:44

T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్‌-2023 నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్‌ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్‌ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టం చేశాడు.

తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్‌ మాజీ క్రికెటర్లు కమ్రాన్‌ అక్మల్‌, యూనిస్‌ ఖాన్‌ తాజాగా స్పందించారు. 

ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా
ఏఆర్‌వై న్యూస్‌తో కమ్రాన్‌ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. 

ఒకవేళ ఆసియా కప్‌-2023 గనుక పాకిస్తాన్‌లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్‌ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్‌ ఆడదు. ఆసియా కప్‌ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌లో పాక్‌ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఒప్పుకొనే ప్రసక్తే లేదు
ఇక యూనిస్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్‌ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్‌ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా అక్టోబరు 23న భారత్‌- పాక్‌ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్‌ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్‌.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్‌ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్‌ అంటేనే..
Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్‌.. తుది జట్టు ఇదే! పంత్‌, అశ్విన్‌, హుడాకు నో ఛాన్స్‌!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌