amp pages | Sakshi

సూర్య, మిల్లర్‌ను కాదని రాహుల్‌కు.. జుట్టు పీక్కున్న అభిమానులు

Published on Mon, 10/03/2022 - 13:32

టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ చూసిన వారెవ్వరైనా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు.  అయితే సూర్యకుమార్‌.. లేదంటే 'కిల్లర్‌' మిల్లర్‌. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరికి కాకుండా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా అని రాహుల్‌ ప్రదర్శనను తీసిపారేయలేము.28 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు సాధించాడు.

కానీ రాహుల్‌ కంటే సూర్యకుమార్‌ ఇంకా బాగా ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అలా కాదనుకుంటే దక్షిణాఫ్రికాను దాదాపు గెలిపించినంత పనిచేసిన మిల్లర్‌కు అయినా ఇవ్వాల్సింది.. అందునా అతను ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో సందేహం రేకెత్తించింది. ఏ లెక్కన కేఎల్‌ రాహుల్‌కు అవార్డు ఇచ్చారో అంతుపట్టడం లేదని జట్టు పీక్కుంటున్నారు.

అవార్డు అందుకున్న అనంతరం ఇదే విషయమై కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు.''నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆశ్చర్యంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనే ఈ అవార్డుకి అర్హుడు. అతనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే సూర్యకుమార్‌ మాత్రం చక్కగా ఆడాడు. ఒకవేళ సూర్యకు ఇవ్వకపోతే.. మిల్లర్‌కు ఇచ్చినా బాగుండేది. జట్టు ఓడిపోయినా సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ అవార్డు నాకు ఎందుకు ఇచ్చారో ఇప్పటికి అంతుచిక్కడం లేదని పేర్కొన్నాడు. 

సూర్యకుమార్‌ కంటే డేవిడ్‌ మిల్లర్‌కు అవార్డు ఇస్తే ఇంకా ఎంతో బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.చాలా సందర్భాల్లో ఓడిపోయిన టీమ్ ప్లేయర్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు ఇవ్వడంచూశాం. ఒకవేళ వీరిద్దరు4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన భారత బౌలర్ దీపక్ చాహార్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చినా బాగుండేదని అంటున్నారు.వీళ్లని కాదని కెఎల్ రాహుల్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం​ 'కేఎల్ రాహుల్ బీసీసీఐ రికమెండేషన్ క్యాండిడేట్‌ కదా.. అందుకే అతనికి అవార్డు వచ్చిందంటూ మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి!

ఓయ్‌ చహల్‌.. ఏంటా పని?

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)