amp pages | Sakshi

కొనసాగుతున్న భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం

Published on Wed, 08/03/2022 - 16:50

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్‌ మరో పతకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌కు కాంస్య పతకం అందించాడు. స్నాచ్ రౌండ్‌లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 192 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్‌ సింగ్‌.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్‌కు చెందిన పెరిక్లెక్స్‌ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్‌ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే, లవ్‌ప్రీత్‌ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే భారత్‌ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్‌ చాను (గోల్డ్‌), జెరెమీ లాల్‌రిన్నుంగ (గోల్డ్‌), అచింట షెవులి (గోల్డ్‌), సంకేత్‌ సర్గార్ (సిల్వర్‌), బింద్యా రాణి (సిల్వర్‌), వికాస్‌ ఠాకుర్‌ (సిల్వర్‌), గురురాజ పుజారి (బ్రాంజ్‌), హర్జిందర్‌ కౌర్‌ (బ్రాంజ్‌).. తాజాగా లవ్‌ప్రీత్‌  బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. 
చదవండి: CWG 2022: దూసుకుపోతున్న భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరో పతకం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)