amp pages | Sakshi

'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'

Published on Sat, 09/10/2022 - 22:22

పాకిస్తాన్‌ యువ పేసర్‌ నసీమ్‌ షా ఊర్వశి రౌతేలా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదని.. ఆమెతో కనీసం ముఖ పరిచయం కూడా లేదని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియా వేదికగా రిషబ్‌ పంత్‌తో లవ్‌ అఫైర్‌ ఉందంటూ వార్తల్లోకి వచ్చింది ఊర్వశి రౌతేలా. అప్పటి నుంచి వార్తలో ఉన్న ఊర్వశి యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో దర్శనమిచ్చింది. 

రిషబ్ పంత్‌ బ్రేకప్ చెప్పిన తర్వాత కొత్త తోడు కోసం చూస్తున్న ఊర్వశి రౌతేలా, పాక్ క్రికెటర్ నసీం షా కోసమే పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లకు వస్తోందంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఊర్వశి రౌతెలా స్పందించలేదు. కానీ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో రెండు సిక్సర్లు బాది హీరోగా మారిపోయిన నసీం షాకి దీని గురించి ప్రశ్న ఎదురైంది.

ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌కి ముందు నసీం షాను ఒక రిపోర్టర్‌ ఇంటర్వ్యూ చేశాడు.''పాకిస్తాన్ ఆడే మ్యాచులకు ఊర్వశి రౌతేలా వస్తోంది. అయితే ఆమె మీకోసమే వస్తుందని చాలా మంది అంటున్నారు దీనిపై మీరేమంటారని'' ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన నసీం షా... ''నాకు ఊర్వశి ఎవరో కూడా తెలీదు. అందుకే నవ్వు వచ్చింది. కొందరు నాకు వీడియోలు పంపుతూ ఉంటారు. నాకు అవన్నీ పట్టించుకోను. నాలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. నా ఫోకస్ అంతా క్రికెట్‌పైనే. క్రికెట్ చూసి నన్ను ప్రేమించే, గౌరవించే వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Road Safety World Series: స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోర

Suresh Raina: సురేశ్‌ రైనా తిరిగి వస్తున్నాడు..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌