amp pages | Sakshi

అలా అయితే నువ్వు మాకొద్దు!

Published on Mon, 01/17/2022 - 17:40

పారిస్‌: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి నిరాకరిస్తూ వస్తున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడనివ్వమంటూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని పక్షంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడటానికి అనుమతి ఇవ్వమని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘ నో వ్యాక్సిన్‌.. నో ఫ్రెంచ్‌ ఓపెన్‌. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. జొకోవిచ్‌కు అయినా ఇదే రూల్‌. వ్యాక్సిన్‌ పాస్‌ రూల్‌ మేము అమలు చేయబోతున్నాం. ఇప్పటికే మాకు హెల్త్‌ పాస్‌ అనేది ఒకటి ఉంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అది ఏ రంగంలో సెలబ్రెటీ అయినా వర్తిస్తుంది’ అని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది మే 22వ తేదీ నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుంది.

కాగా, అంతకముందు వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీంతో టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది.

అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్‌ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)