amp pages | Sakshi

తిప్పేసిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లు.. పాకిస్తాన్‌ ఎంతకు ఆలౌటైందంటే..?

Published on Sat, 12/17/2022 - 18:28

PAK VS ENG 3rd Test Day 1: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి పాకిస్తాన్‌ తొలి రోజే ఆలౌటైంది. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (78), అఘా సల్మాన్‌ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (30), అజహార్‌ అలీ (45) పర్వాలేదనిపించారు. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (8), మహ్మద్‌ రిజ్వాన్‌ (19), సౌద్‌ షకీల్‌ (23), ఫహీమ్‌ అష్రాఫ్‌ (4), నౌమాన్‌ అలీ (20), అబ్రర్‌ అహ్మద్‌ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్‌ రెహాన్‌ అహ్మద్‌ 2, రూట్‌, మార్క్‌ వుడ్‌, రాబిన్సన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. బెన్‌ డకెట్‌ (4), ఓలీ పోప్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌ స్కోర్‌కు ఇంకా 297 పరుగులు వెనుకపడి ఉంది. 

కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇం‍గ్లండ్‌.. బజ్‌ బాల్‌ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్‌ సేన.. ముల్తాన్‌ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది.  
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌