amp pages | Sakshi

ఆసీస్‌ 47వ టెస్టు కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌.. వైస్‌ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

Published on Fri, 11/26/2021 - 18:14

Pat Cummins As 47 Test Captain For Australia.. ఆస్ట్రేలియా 47వ టెస్టు కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌ను ఎంపికచేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) అధికారిక ప్రకటన చేసింది. కీలకమైన యాషెస్‌ టెస్టు సిరీస్‌కు కమిన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌గా ఒక ఫాస్టెస్ట్‌ బౌలర్‌ వ్యవహరించడం ఇదే తొలిసారి. కాగా టిమ్‌ పైన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పేందుకు సీఏ మొగ్గుచూపింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 8 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడనుంది.

టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన పాట్‌ కమిన్స్‌ మీడియాతో మాట్లాడాడు.'' సమ్మర్‌లో కీలకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా జట్టును నడిపిస్తున్న టిమ్‌ పైన్‌ వ్యక్తిగత కారణాల రిత్యా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతని నుంచి స్వీకరించిన కెప్టెన్సీని సక్రమంగా నిర్వహిస్తా. వైస్‌ కెప్టెన్‌ అయిన స్టీవ్‌ స్మిత్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా అనుభవం ఉండడం నాకు కలిసొచ్చే అంశం. సీనియర్లు, జూనియర్లను కలుపుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాలనుకుంటున్నా'' అని చెప్పుకొచ్చాడు. 

కాగా టెస్టు కెప్టెన్‌గా ఉన్న టిమ్‌ పైన్‌ 2017లో ఒక మహిళతో అసభ్యకర చాటింగ్‌(సెక్స్‌ స్కాండల్‌)లో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో.. అది నిజమేనని ఒప్పుకున్న పైన్‌ కీలకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అప్పటినుంచి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పనున్నారనే దానిపై వార్తలు వచ్చాయి. ఒక దశలో స్టీవ్‌ స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కమిన్స్‌ 34 టెస్టుల్లో  164 వికెట్లు పడగొట్టాడు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)