amp pages | Sakshi

ఔట్‌ కాదనుకుంటా.. పాల్‌ స్టిర్లింగ్‌ మోసపోయాడు

Published on Sun, 10/23/2022 - 10:58

టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ను థర్డ్‌ అంపైర్‌ మోసం చేశాడు. స్టిర్లింగ్‌ ఔట్‌ కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికి థర్డ్‌ అంపైర్‌ రిప్లేని మరోసారి చెక్‌ చేయకపోవడం ఐర్లాండ్‌ ఓపెనర్‌ను ముంచింది. ఫలితంగా పాల్‌ స్టిర్లింగ్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్‌లో ధనుంజయ డిసిల్వా వేసిన నాలుగో బంతిని పాల్‌  స్టిర్లింగ్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే బౌండరీలైన వద్ద ఉన్న బానుక రాజపక్స ముందుకు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ తీసుకున్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. ముందుకు వచ్చి పట్టడంతో క్యాచ్‌పై క్లియర్‌ విజన్‌ కనిపించలేదు. అయితే తర్వాత రిప్లేలో రాజపక్స క్యాచ్‌ తీసుకున్న తర్వాత బంతిని గ్రౌండ్‌పై పెట్టినట్లు కనిపించింది.

ఇది చూసిన పాల్‌ స్టిర్లింగ్‌ కాసేపు అలాగే నిలబడినప్పటికి థర్డ్‌ అంపైర్‌ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం చేయలేక పెవిలియన్‌ బాట పట్టాడు. అప్పటికి స్టిర్లింగ్‌ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌.. కోహ్లి ముంగిట అరుదైన రికార్డు

దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్‌ కొట్టదు

Videos

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)