amp pages | Sakshi

క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్ రికార్డు సమం!

Published on Fri, 11/10/2023 - 20:17

దక్షిణాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు పట్టిన డికాక్‌.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్‌ల క్యాచ్‌లను అందుకున్న డికాక్‌.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2003 ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా నమీబియాపై ఆరు క్యాచ్‌లను పట్టాడు.

అదే విధంగా 2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇదే ఫీట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్‌) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రోటీస్‌ బౌలర్లలో పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహారాజ్‌, ఎంగిడి తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IPL 2024: ఆర్సీబీలోకి రచిన్‌ రవీంద్ర.. హింట్‌ ఇచ్చిన యువ సంచలనం!

Videos

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)