amp pages | Sakshi

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌.. బెంగాల్‌ జట్టు ప్రపంచ రికార్డు

Published on Wed, 06/08/2022 - 16:42

రంజీ క్రికెట్‌ చరిత్రలో ఒక అరుదైన ఫీట్‌ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్‌-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్‌ సెంచరీతో మెరిశారు. బెంగాల్‌, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో టాప్‌-9 మంది బ్యాటర్స్‌ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్‌ఫర్డ్‌ అండ్‌ కేమ్‌బ్రిడ్జ్‌ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్‌-8 బ్యాటర్స్‌ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్‌ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపం‍చ రికార్డు నెలకొల్పింది.


బెంగాల్‌ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్‌ కనీసం హాఫ్‌ సెంచరీ మార్క్‌ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్‌ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్‌ మజుందార్‌(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ 65, మరో ఓపెనర్‌ అభిషేక్‌ రమణ్‌ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మజుందార్‌ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు.


ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్‌ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరేల్‌ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగిన షాబాజ్‌ అహ్మద్‌ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్‌ 53 నాటౌట్‌, ఆకాశ్‌దీప్‌( 18 బంతుల్లో  8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్‌ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన జార్ఖండ్‌ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్‌ సౌరబ్‌ తివారీ 25, విరాట్‌ సింగ్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్‌ నిజామ్‌ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్‌ కుమార్‌ డియోబ్రాత్‌ 11 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్‌.. వీడియో వైరల్‌

రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్‌ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్‌ పార్కర్‌

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌