amp pages | Sakshi

పాపం శ్రేయస్‌ అయ్యర్‌.. రిజర్వ్‌ ఆటగాడిగా కూడా పనికి రాడా..?

Published on Thu, 10/13/2022 - 19:25

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. వరల్డ్‌కప్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితా నుంచి కూడా అతన్ని తప్పించి ఘోరంగా అవమానించింది. ‌ప్రస్తుతానికి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే ఉండి ముస్తాక్‌ అలీ ట్రోఫీలో (ముంబై) ఆడాలని ఆజ్ఞాపించింది. బీసీసీఐ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి అవాక్కైన అయ్యర్‌ చేసేదేమీ లేక ముంబై జట్టుతో చేరిపోయాడు. 

శ్రేయస్‌తో పాటు రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపికైన రవి బిష్ణోయ్‌ది కూడా ఇదే పరిస్థితి. బిష్ణోయ్‌ కూడా ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడేందుకు రాజస్థాన్‌ జట్టుతో కలవాలని బీసీసీఐ ఆదేశించింది. వరల్డ్‌కప్‌ జట్టులో ఎవరైన గాయపడితే, తామే కబురు పెడతామని బీసీసీఐ ఈ ఇద్దరికి సర్ధిచెప్పింది. ఇదిలా ఉంటే, శ్రేయస్‌, బిష్ణోయ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌లను బీసీసీఐ తొలుత రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

వీరిలో షమీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేయడంతో నిన్ననే (అక్టోబర్‌ 12) ఆస్ట్రేలియాకు బయల్దేరగా.. గాయం నుంచి కోలుకోని చాహర్‌ ఎన్‌సీఏకే (నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ) పరిమితమాయ్యడు. ఇక రెగ్యులర్‌ జట్టులోని సభ్యుడు బుమ్రా గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మహ్మద్‌ సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌లను బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. వీరిద్దరు కూడా నిన్ననే షమీతో పాటు ఆస్ట్రేలియాకు బయల్దేరారు. 

ఇదిలా ఉంటే, ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 3 వన్డేలు ఆడిన అయ్యర్‌..  191 సగటున 191 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ,  హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ శ్రేయస్‌ను కనీసం రిజర్వ్‌ ఆటగాడిగా కూడా పరిగణించకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ వాదన ఇంకోలా ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా పటిష్టంగా ఉందని, డౌట్‌ఫుల్‌గా ఉండిన దీపక్‌ హూడా కూడా ఫిట్‌గా మారాడని, అందుకే శ్రేయస్‌ను ఇండియాలోనే ఉండిపోవాలని సూచించామని కవరింగ్‌ చేసుకుంది. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు