amp pages | Sakshi

Royal London One-Day Cup: పుజారా ప్రతాపం

Published on Mon, 08/15/2022 - 04:44

లండన్‌: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్‌ లండన్‌ వన్డే కప్‌’లో ససెక్స్‌ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్‌షైర్‌తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు.

దీంతో ససెక్స్‌ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు  సాధించింది. ఓపెనర్లు హారిసన్‌ (5), అలీ అర్‌ (4) విఫలమవగా... కెప్టెన్‌ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్‌ క్లార్క్‌ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్‌ అవుటయ్యాక అస్లాప్‌ (22), రాలిన్స్‌ (15), ఇబ్రహీం (15 నాటౌట్‌)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ రియాన్‌ పటేల్‌ (65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), టామ్‌ లవెస్‌ (57 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్‌ నాలుగు, రాలిన్స్‌ మూడు వికెట్లు తీశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌