amp pages | Sakshi

చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు!

Published on Mon, 11/28/2022 - 15:46

Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final: టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు సారథ్యం వహిస్తున్న రుత్‌రాజ్‌ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీ  క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

శివసింగ్‌ మైండ్‌ బ్లాక్‌
మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ 49 ఓవర్‌ వేసిన శివ సింగ్ బౌలింగ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లు బాదగా.. ఐదో బంతిని బౌలర్‌ నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా స్టాండ్స్‌కు తరిలించాడు.

ప్రపంచ రికార్డు
ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదడం లిస్ట్‌- ఏ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌ 16 సిక్సులు, 10 ఫోర్లతో 220 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రుత్‌రాజ్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది.


చదవండిIndian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్‌ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌