amp pages | Sakshi

T20 World Cup 2022 : స్యామ్‌ కరన్‌ 5/10

Published on Sun, 10/23/2022 - 05:56

పెర్త్‌: టి20 వరల్డ్‌ కప్‌ను మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ విజయంతో మొదలు పెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొంత తడబడినా, చివరకు లక్ష్యాన్ని చేరింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ‘సూపర్‌ 12’ గ్రూప్‌–1 లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఉస్మాన్‌ ఘని (30 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.

పేసర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్యామ్‌ కరన్‌ (5/10) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టి20ల్లో ఇంగ్లండ్‌ తరఫున ఒక బౌలర్‌ 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్టోక్స్, మార్క్‌ వుడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. బట్లర్‌ (18), హేల్స్‌ (19) ప్రభావం చూపలేకపోగా...ఆ తర్వాత తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే లివింగ్‌స్టోన్‌ (21 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి జట్టును ఒడ్డున పడేశాడు. 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)