amp pages | Sakshi

ఆసుపత్రిలో చేరిన క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌

Published on Mon, 11/14/2022 - 09:10

ఇటీవలే దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ విజయ్‌ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్‌ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్‌ చేయగా స్టోన్స్‌ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్‌ ఖాన్‌ వెల్లడించాడు.

ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్‌ ఖాన్‌ ఇటీవలే ముంబై సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్‌-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు.

ఇక విజయ్‌ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్‌ పేసర్‌ శివమ్‌ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్‌ ఖాన్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్‌ అ‍య్యర్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది.

చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు

ఇంగ్లండ్‌ గెలుపులో మూల స్తంభాలు..

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)