amp pages | Sakshi

2002లో కెప్టెన్సీ ఛాన్స్‌.. కానీ వద్దనుకున్నా! ఒకవేళ అదే జరిగి ఉంటే..

Published on Thu, 02/23/2023 - 12:35

Shoaib Akhtar Comments: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరొందిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌.. అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బాల్‌ వేసిన అక్తర్‌ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.

ఇక పాకిస్తాన్‌ తరఫున 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అక్తర్‌ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 178 వికెట్లు, 247 వికెట్లు, 19 వికెట్లు పడగొట్టాడు. జట్టులో కీలక సభ్యుడైన అతడు 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

2002లోనే ఛాన్స్‌.. కానీ
అయితే, ఒకానొక సందర్భంలో అతడికి కూడా కెప్టెన్సీ అవకాశం వచ్చిందట. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను వదులుకున్నాడట. ఈ విషయాన్ని షోయబ్‌ అక్తర్‌ స్వయంగా వెల్లడించాడు. ‘‘2002లో నాకు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కానీ నేను సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేను.

ఆ సమయంలో పూర్తి ఫిట్‌గా లేను. ఐదు మ్యాచ్‌లు ఉంటే.. కేవలం 3 మాత్రమే ఆడే పరిస్థితి. ఒకవేళ అప్పుడు నేను ప్రతీ మ్యాచ్‌ ఆడి ఉంటే కేవలం ఒకటిన్నర- రెండేళ్లపాటే నా కెరీర్‌ కొనసాగేది’’ అని అక్తర్‌ క్రికెట్‌ పాకి​స్తాన్‌తో వ్యాఖ్యానించాడు.

బోర్డులో అనిశ్చితి
ఇక నాటి మేనేజ్‌మెంట్‌ గురించి వివరిస్తూ.. ‘‘జట్టు సభ్యులకు నేను పూర్తి మద్దతుగా నిలబడ్డాను. నిజానికి అప్పుడు బోర్డులో అనిశ్చితి నెలకొంది. మిస్‌మేనేజ్‌మెంట్‌ కారణంగా సమస్యలు తలెత్తాయి’’ అని 47 ఏళ్ల అక్తర్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత క్రికెట్‌ విశ్లేషకుడిగా మారిన అక్తర్‌.. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నాడు.

చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త సారధి పేరు ప్రకటన
Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?