amp pages | Sakshi

Sourav Ganguly: విరాట్‌ కోహ్లి నన్ను మించిన తోపు..!

Published on Sat, 09/10/2022 - 18:43

1020 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి బ్యాక్‌కు యాక్షన్‌ అన్న సంకేతాలు పంపిన టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా కప్‌-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీతో (61 బంతుల్లో 122 నాటౌట్‌) చెలరేగిన అనంతరం దాదా అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. నైపుణ్యం పరంగా కోహ్లి నన్ను మించిన ఆటగాడని ఆకాశానికెత్తాడు. రిటైరయ్యే నాటికి కోహ్లి తనకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడతాడని జోస్యం చెప్పాడు. కోహ్లి కెరీర్‌లో అవరోధాలను అధిగమించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. 

టాలెంట్‌ పరం‍గా కోహ్లి గొప్ప ఆటగాడనటానికి అతని రికార్డులే నిదర్శనమని అన్నాడు.  కెప్టెన్సీ వివాదంలో కోహ్లి పట్ల కఠినంగా వ్యవహరించిన గంగూలీ.. రన్‌మెషీన్‌ తిరిగి ఫామ్‌ను అందుకున్న తర్వాత ఇలా పాజిటివ్‌గా రియాక్ట్‌ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, కోహ్లి ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విషయం విధితమే. ఈ టోర్నీలో కోహ్లి.. సెంచరీతో పాటు రెండు క్లాసిక్‌ హాఫ్‌ సెంచరీలు సాధించాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన కోహ్లి.. కెరీర్‌లో 71వ శతకాన్ని, టీ20ల్లో తొలి సెంచరీని సాధించాడు. కోహ్లి సూపర్‌ సెంచరీ చెలరేగడంతో నామమాత్రంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి చివరిసారి 2019 నవంబర్‌లో సెంచరీ సాధించాడు. 
చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌