amp pages | Sakshi

శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!

Published on Fri, 11/19/2021 - 08:48

Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్  తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్‌ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్‌ అధికారి ఒకరు తెలిపారు.

“మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్‌ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్‌ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్‌ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్‌ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)