amp pages | Sakshi

12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా

Published on Sat, 11/13/2021 - 10:27

Daryl Mitchell, Marcus Stoinis Played Same Team Before 12 Years.. టి20 ప్రపంచకప్‌ 2021 తుది అంకానికి చేరుకుంది. నవంబర్‌ 14న జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టగా.. అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి తుది సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ హీరోగా నిలిస్తే.. ఇటు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వేడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన మార్కస్‌ స్టోయినిస్‌ అంతే ప్రముఖపాత్ర పోషించాడు.

చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్‌ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్‌ అంటున్న విశ్లేషకులు

ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. మిచెల్‌, స్టోయినిస్‌లు ఇద్దరు 12 ఏళ్ల క్రితం ఒక టోర్నీలో కలిసి ఆడారు. కలిసి ఆడడమే కాదు.. ఏకంగా కప్‌ను కూడా అందించారు. విషయంలోకి వెళితే 2009లో మిచెల్‌, స్టోయినిస్‌లు ప్రీమియర్‌షిప్‌ క్రికెట్‌ టోర్నీలో స్కార్‌బరో అనే టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. సెమీఫైనల్లో స్టోయినిస్‌ (189 పరుగులు ) సూపర్‌ శతకంతో మెరవడంతో స్కార్‌బరో ఫైనల్‌కు చేరింది. ఇక బేస్‌వాటర్‌-మోర్లీతో జరిగిన ఫైనల్లో డారిల్‌ మిచెల్‌ అనూహ్యంగా బౌలింగ్‌లో మెరిశాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అలా ఈ ఇద్దరు కలసి స్కార్‌బరో కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా మిచెల్‌, స్టోయినిస్‌లు టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. 

చదవండి: Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్‌ కొట్టిన వార్నర్‌.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌