amp pages | Sakshi

టీమిండియా ప్రదర్శన షాకింగ్‌.. దారుణం.. అసలేం చేశారు: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published on Mon, 11/01/2021 - 11:10

Inzamam-ul-Haq Comments On Team India Loss: ‘‘ఇండియా- పాకిస్తాన్‌ తర్వాత ఈ టోర్నమెంట్‌లో ఇదే పెద్ద మ్యాచ్‌. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య పోరు కన్నా ఆసక్తికరం. కానీ... ఇంతటి ప్రాముఖ్యం గల మ్యాచ్‌లో టీమిండియా ఆడిన విధానం నన్ను విస్మయానికి గురిచేసింది. అసలు వాళ్లు ఏం చేశారో అర్థం కాలేదు.

అంత పెద్ద జట్టు.. ఇంతలా ఒత్తిడికి గురవడమేమిటో నాకస్సలు అర్థం కావడం లేదు’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లి సేన ఓటమి తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు. 

కాగా సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా కనీసస్థాయి ప్రదర్శన కనబరచకలేక ఒత్తిడిలో చిత్తయింది.

ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించిన ఇంజమామ్‌... భారత జట్టు ప్రదర్శనపై పెదవి విరిచాడు. ‘‘న్యూజిలాండ్‌ స్పిన్నర్లు బాగా బౌలింగ్‌ చేయగలరు. కానీ వరల్డ్‌ క్లాస్‌ మాత్రం కాదు. కానీ... టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి బౌలింగ్‌లో సింగిల్స్‌ కూడా తీయలేకపోయారు.

స్పిన్‌ బౌలింగ్‌లో చక్కగా ఆడటమే కోహ్లి బలం. తను కూడా సింగిల్స్‌ కూడా తీయలేకపోవడం దారుణం’’ అని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ కకావికలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. (17 బంతుల్లో 9 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే... పాకిస్తాన్‌ వరుసగా టీమిండియా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌పై విజయాలతో సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారు చేసుకుంది.

చదవండి: T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! 

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)