amp pages | Sakshi

T20 World Cup 2021: నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన నమీబియా..

Published on Wed, 10/20/2021 - 16:29

నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన నమీబియా.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. డేవిడ్‌ వీజ్‌(40 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌(22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో జేజే స్మిట్‌(8 బంతుల్లో 14) ధాటిగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో నమీబియా 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు ఫ్రెడ్‌ క్లాసీన్‌, కొలిన్‌ ఆకెర్‌మాన్‌, పీటర్‌ సీలార్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నమీబియా టార్గెట్‌ 165.. 10 ఓవర్ల తర్వాత 68/3
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టెఫాన్‌ బార్డ్‌(20 బంతుల్లో 19), జేన్‌ గ్రీన్‌(12 బంతుల్లో 15), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ క్రెయిగ్‌ విలియమ్స్‌(13 బంతుల్లో 11) ఔటయ్యారు. నెదర్లాండ్స్‌ బౌలర్లు ఫ్రెడ్‌ క్లాసీన్‌, కొలిన్‌ ఆకెర్‌మాన్‌, పీటర్‌ సీలార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. క్రీజ్‌లో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌(10), డేవిడ్‌ వీజ్‌(8) ఉన్నారు.

చెలరేగిన నెదర్లాండ్స్‌ ఓపెనర్‌.. నమీబియా టార్గెట్‌ 165
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌.. ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌(56 బంతుల్లో 70; 6 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓడౌడ్‌కు మిడిలార్డర్‌ బ్యాటర్‌ కొలిన్‌ ఆకెర్‌మాన్‌(32 బంతుల్లో 35; ఫోర్‌, సిక్స్‌), వికెట్‌కీపర్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్(21 నాటౌట్‌) సహకరించడంతో నెదర్లాండ్స్‌ ఓ మోస్తరు భారీ స్కోర్‌ సాధించగలిగింది. నమీబియా బౌలర్లలో జాన్‌ ఫ్రైలింగ్‌ రెండు వికెట్లు పడగొట్టగా. డేవిడ్‌ వీజ్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

అబుదాబీ: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.


తుది జట్లు: 
నెదర్లాండ్స్‌: మాక్స్‌ ఆడౌడ్‌, స్టెఫాన్‌ మైబుర్గ్‌, బాస్‌ డీ లీడే, కొలిన్‌ ఆకెన్‌మాన్‌, రియాన్‌ టెన్‌ డొచేట్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌(వికెట్‌ కీపర్‌), రోలోఫ్‌ వాన్‌ దెర్‌ మెర్వీ, పీటర్‌ సీలార్‌(కెప్టెన్‌), లాగన్‌ వాన్‌ బీక్‌, టిమ్‌ వాండర్‌ గుగ్టెన్‌, ఫ్రెడ్‌ క్లాసీన్‌.

నమీబియా: స్టీఫెన్‌ బార్డ్‌, జానే గ్రీన్, క్రెయిగ్‌ విలియమ్స్‌, గెర్హాడ్‌ ఎరాస్‌మస్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వీజ్‌, జేజే స్మిత్‌, మైఖేల్‌ వాన్‌ లింగెన్‌, జాన్‌ ఫ్రిలింక్‌, జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, రూబెన్‌ ట్రంపెల్‌మాన్‌, బెర్నార్డ్‌ షోల్ట్‌.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)