amp pages | Sakshi

దుమ్మురేపిన ఓపెనర్లు.. ఐదోసారి సెమీస్‌కు పాకిస్తాన్‌

Published on Wed, 11/03/2021 - 07:48

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయంతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌–2లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ బృందం 45 పరుగుల తేడాతో క్రికెట్‌ కూన నమీబియాపై జయభేరి మోగించి ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఐదోసారి సెమీఫైనల్‌కు చేరింది. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (50 బంతుల్లో 79 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (49 బంతుల్లో 70; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట నింపాదిగా ఆడిన ఈ ఓపెనర్లు తర్వాత దంచేశారు. జట్టు స్కోరు తొమ్మిదో ఓవర్లో 50 పరుగులకు చేరింది. తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడటంతో కేవలం 4 ఓవర్ల వ్యవధిలో 13వ ఓవర్లో పాక్‌ 100 పరుగులను అధిగమించింది. ఈ క్రమంలో బాబర్‌ (39 బంతుల్లో; 5 ఫోర్లు), రిజ్వాన్‌ (42 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 14.2 ఓవర్లలో 113 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వన్‌డౌన్‌లో ఫఖర్‌ జమన్‌ (5) విఫలమవ్వగా.... ఆఖర్లో హఫీజ్‌ (16 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడింది. డేవిడ్‌ వీస్‌ (31 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రెయిగ్‌ విలియమ్స్‌ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఓపెనర్‌ స్టీఫెన్‌ బార్డ్‌ (29; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, ఇమద్, రవూఫ్, షాదాబ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు సెమీఫైనల్‌ దశకు చేరుకున్న తొలి జట్టుగా పాకిస్తాన్‌ ఘనత వహించింది. 2007లో రన్నరప్‌ గా నిలిచిన పాక్‌... 2009లో చాంపియన్‌ అయ్యింది. 2010, 2012లలో సెమీస్‌లో ఓడింది.

Videos

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?