amp pages | Sakshi

ఆ ముద్దు పేరును జీవితాంతం మర్చిపోలేను : రైనా

Published on Wed, 08/19/2020 - 15:09

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) లో చెన్నై అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు వెలకట్టలేనిదని  చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)  వైఎస్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా అన్నారు. తనకు, ధోనీకి చెన్నై ఫ్యాన్స్‌ పెట్టిన ముద్దుపేర్లను జీవితాంతం మర్చిపోలేమన్నారు. కాగా, రైనా, ధోనీ గత 12 ఏళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.  ఈ ఇద్దరికి తమిళనాడు వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. వారంత ధోనీని తాల, రైనాను చిన్న తాలగా పిలుచుకుంటారు(తాల అంటే పెద్దన్న అని అర్థం). ఈ ముద్దు పేర్లపై  సురేష్‌ రైనా  స్పందిస్తూ ..  ధోనీని, తనను తాల, చిన్న తాల అని పిలిచినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు. 1975లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘షోలే’లో అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర  పోషించిన పాత్రలు జై, వీరూ మాదిరి ధోనీ, తాను కూడా మంచి స్నేహితుల్లా ఉన్నామనే ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. (చదవండి : డ్రీమ్‌' ధనాధన్)

‘వారి పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. మేము తొలుత దక్షిణాది వైపు వెళ్లినప్పుడు మాపై చాలా బాధ్యత ఉండేది. మా ఆటతో వారిని మెప్పిస్తామో లేదో అని భయపడ్డాం. కానీ దక్షిణాది ప్రజలు మా ఆటను ఆస్వాదించారు. దానికి కారణం మా ఫ్యాన్సే. వాళ్లు మాకు చాలా మద్దతుగా నిలిచారు. చాలా స్వేచ్ఛను ఇచ్చారు. వారి ప్రేమ, మద్దతుతోనే ఐపీఎల్‌లో రానించగలిగాం. ధోనీని, నన్ను తాల, చిన్న తాల అని చెన్నై ఫ్యాన్స్‌ పిలిస్తే.. షోలే సినిమాలో జై, వీరులాంటి వాళ్లమనే  ఫీలింగ్‌ కలిగేది. వారిచ్చిన ముద్దు పేరు, చూపించిన ప్రేమ, మద్దతును జీవితాంతం మర్చిపోలేను’అని రైనా చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 15న ధోనీ, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో మాత్రం వీరిద్దరు కొనసాగనున్నారు. 
(చదవండి : ధోని కెప్టెన్‌ అవుతాడని అప్పుడే ఊహించా)

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌