amp pages | Sakshi

క్లీన్‌స్వీప్‌పై గురి

Published on Tue, 12/08/2020 - 04:00

సిడ్నీ: మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌ తుది సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్‌ వేదికలోనే ఇరు జట్లు నేడు మూడో టి20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్‌ తరహాలోనే చివరి మ్యాచ్‌ గెలిచి ఆసీస్‌ లెక్క సరి చేస్తుందా... లేక భారత్‌ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందా అనేది ఆసక్తికరం. భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో దిగే అవకాశం కనిపిస్తుండగా... ఆస్ట్రేలియా కూడా టెస్టు స్పెషలిస్ట్‌లను దూరంగా ఉంచాలనే నిర్ణయించింది.

నటరాజన్‌పైనే అందరి దృష్టి...
షమీ, బుమ్రాలవంటి సీనియర్లు లేకుండానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత్‌ మరోసారి యువ బౌలర్లనే నమ్ముకోనుంది. భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో కూడా కేవలం 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన నటరాజన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్‌లో తన యార్కర్లతోనే గుర్తింపు తెచ్చుకున్నా... అంతకుమించి వైవిధ్యభరిత ప్రతిభ అతనిలో ఉందని తాజా ప్రదర్శన నిరూపించింది. మరో మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆడిన తొలి సిరీస్‌లోనే నటరాజన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలవడం ఖాయం. మిగతా ఇద్దరు పేసర్లు దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్‌ కూడా ఆసీస్‌ను కట్టడి చేయగలరు. ఆఫ్‌ స్పిన్నర్‌ సుందర్‌ ఎప్పటిలాగే పొదుపుగా బౌలింగ్‌ చేస్తుండగా... లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ తొలి టి20 మ్యాచ్‌ మ్యాజిక్‌ను మళ్లీ చూపించాల్సి ఉంది. బ్యాటింగ్‌పరంగా ఎలాంటి లోపాలు లేవు. కోహ్లి చెప్పినట్లు ఐపీఎల్‌ అనుభవం జట్టులో సభ్యులందరికీ ఈ సిరీస్‌ గెలుచుకోవడంలో బాగా పనికొచ్చింది.  

ఫించ్‌ జట్టులోకి...
ప్రత్యర్థితో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయినా సరే తొలి మ్యాచ్‌లో లక్ష్యం ఛేదించలేక, రెండో మ్యాచ్‌లో దానిని కాపాడుకోలేక జట్టు చతికిలపడింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. టి20 ప్రమాణాలపరంగా చూస్తే అతి పేలవంగా ఆడుతున్న డార్సీ షార్ట్‌పై వేటు ఖాయమైంది. వన్డే సిరీస్‌ తరహాలో మ్యాక్స్‌వెల్‌ నుంచి ఒక దూకుడైన ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ ఆశిస్తోంది.

రానున్న టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా టాప్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌కు కూడా ఈ మ్యాచ్‌ నుంచి విరామం ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఆసీస్‌ అసలు సమస్య అంతా బౌలింగ్‌లోనే ఉంది. ఒక్క అనుభవజ్ఞుడైన ఆటగాడు కూడాలేని లైనప్‌ భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిచడం అంత సులువు కాదు. టెస్టుల్లో కీలకమయ్యే పేసర్లను సిరీస్‌ కోల్పోయిన తర్వాత టి20ల్లో బరిలోకి దింపడం అనవసర మనే భావన టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో  ఉంది.

పిచ్, వాతావరణం
తొలి రెండు వన్డేలు, రెండో టి20లో ఇక్కడ పరుగుల వరద పారింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్‌ చహర్, నటరాజన్, చహల్‌.
ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, క్యారీ, హెన్రిక్స్, సీన్‌ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)