amp pages | Sakshi

U19 WC: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన నివేథన్‌.. ఆసీస్‌దే విజయం

Published on Sat, 02/05/2022 - 11:23

Under 19 World Cup- Nivethan Radhakrishnan Super Innings: భారత సంతతి కుర్రాడు, ఆస్ట్రేలియా క్రికెటర్‌ నివేథన్‌ రాధాకృష్ణన్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌ టోర్నీలో అదరగొట్టాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా వెస్టిండీస్‌ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఓపెనర్‌ మహ్మద్‌ ఇషాక్‌(34 పరుగులు), కెప్టెన్‌ సులేమాన్‌ సైఫీ 37 పరుగులు, అహ్మద్‌ అహ్మద్‌జై 81 పరుగులతో రాణించడంతో 10 వికెట్ల నష్టానికి అఫ్గన్‌ 201 పరుగులు చేసింది. నివేథన్‌ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్‌ కాంప్‌బెల్‌ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి.

అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు ఆసీస్‌నే వరించింది. రెండు వికెట్లు పడగొట్టడం సహా హాఫ్‌ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన నివేథన్‌ రాధాకృష్ణన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లలో భాగంగా అఫ్గన్‌.. ఇంగ్లండ్‌ చేతిలో ఓడగా... ఆసీస్‌ను భారత్‌ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌, భారత్‌ తుదిపోరుకు అర్హత సాధించగా.. అఫ్గన్‌- ఆసీస్‌ మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. నివేథన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ రెండు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.

స్కోర్లు:
అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 201 (49.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా అండర్‌-19 202/8 (49.1 ఓవర్లు)

చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్‌ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌