amp pages | Sakshi

ind vs sa: శెభాష్‌.. దక్షిణాఫ్రికాపై భారత్‌ అద్భుత విజయం! ఏకంగా..

Published on Sun, 01/16/2022 - 11:49

U 19 World Cup Ind Vs Sa: అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయంతో టోర్నిని ఆరంభించింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సారథి యశ్‌ ధుల్‌ 82 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా... బౌలర్‌ విక్కీ ఒత్వాల్‌ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన విక్కీ.. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి  5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

కాగా వెస్టిండీస్‌ వేదికగా అండర్‌- 19 ప్రపంచకప్‌ ఈవెంట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌- బిలోని భారత్‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా... యశ్‌ సేన 232 పరుగులకు ఆలౌట్‌ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్‌ యువ జట్టుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 

ఓపెనర్లు జాన్‌ డకౌట్‌ కాగా... వాలంటైన్‌ 25 పరుగులు చేసి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెవిస్‌ ఒక్కడే 65 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్‌ విక్కీ 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్‌ బవా 4 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 187 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో 45 పరుగుల తేడాతో విజయం భారత జట్టు సొంతమైంది. 

ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో ఘోర వైఫల్యంతో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మన యువ జట్టు ప్రొటిస్‌ టీమ్‌పై సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ... అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘శెభాష్‌... మీ స్థాయికి తగ్గట్లు రాణించారు.. కనీసం మీరైనా గెలిచారు. దెబ్బకొట్టారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అండర్‌-19 ప్రపంచకప్‌
స్కోర్లు: భారత్‌- 232-10 (46.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా- 187-10 (45.4 ఓవర్లు)

చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్‌ శర్మ పోస్టు వైరల్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌