amp pages | Sakshi

"బౌన్స్‌ పిచ్‌లపై ఆడటానికి సిద్ధంగా ఉన్నా"

Published on Sun, 01/02/2022 - 11:26

టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్‌ని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫి, విజయ్‌ హాజరే ట్రోఫిలో అయ్యర్‌ అద్భుతంగా రాణించాడు. ఇక టీ20ల్లో భారత తరుపున అరంగేట్రం చేసిన అయ్యర్‌.. మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులుతోపాటు, మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా భారత వన్డే జట్టులో చోటు దక్కడం పట్ల  అయ్యర్‌ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న దక్షిణాప్రికా పర్యటనలో మరోసారి తనుఎంటో నిరూపించుకోవడానికి  అయ్యర్‌ సిద్దం అవుతున్నాడు. ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, రిలాక్స్‌గా ఉండాలని అయ్యర్‌ తెలిపాడు. 

"నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాను. దక్షిణాప్రికా పిచ్‌లు ఎక్కువగా బౌన్స్‌కు అనుకులస్తాయి. బౌన్స్‌ పిచ్‌లపై ఒక బౌలర్‌, ఫీల్డర్‌, బ్యాటర్‌గా నా పాత్రను ఎలా నిర్వహించాలో నేను అన్ని విధాల సన్నద్దం అవుతున్నాను. నేను దక్షిణాఫ్రికాకు చేరుకున్న వెంటనే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉంది" అని అయ్యర్‌ పేర్కొన్నాడు. ఇక భారత్‌- దక్షిణాప్రికా మధ్య తొలి వన్డే జనవరి 19న ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), చహల్‌, ఆర్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)