amp pages | Sakshi

అందుకే కోహ్లి 'కింగ్‌' అయ్యాడు.. దేశమే అతనికి ముఖ్యం.. ఏం జరిగిందో చూడండి..!

Published on Tue, 02/21/2023 - 12:16

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ముద్దుగా కింగ్‌ అని పిలుచుకుంటారన్న విషయం విధితమే. భారత క్రికెట్‌ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి కోహ్లి పేరులో కింగ్‌ అనే బిరుదును కలిపేశారు. కోహ్లికి కింగ్‌ అనే బిరుదు రావడానికి అతని గ్రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఎంత కారణమో, అతని బిహేవియర్‌ కూడా అంతే కారణం.

ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే కింగ్‌ కోహ్లి.. సందర్భానుసారంగా రియాక్ట్‌ అవుతూ చాలా హుందాగా కూడా కనిపిస్తాడు. ప్రత్యర్ధులు కవ్విస్తే ఉగ్రరూపం దాల్చే కోహ్లి.. అదే వారు కలిసిపోతే సరదాగా డ్యాన్స్‌లు వేస్తూ మైదానంలో ఉన్న ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను హుషారెక్కిస్తాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత విజయానంతరం కోహ్లి ఇలాగే ఓ పాపులర్‌ బాలీవుడ్‌ పాటకు స్టెప్పులేసి అలరించాడు.

తన ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉండే కోహ్లి, న్యూఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా జరిగిన ఓ విషయంతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌మీడియాగా నిలిచాడు. ఢిల్లీ టెస్ట్‌ మూడో రోజు ఆటలో విరాట్‌ కోహ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు.

ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్‌ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్‌కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

కోహ్లి దేశానికి ఇచ్చే ప్రాధాన్యతను కొనియాడుతూ అభిమానులు కామెంట్ల‍తో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్నారు. కింగ్‌ అనే బిరుదుకు కోహ్లి వంద శాతం అర్హుడని ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి చర్యతో మరోసారి భారత క్రికెట్‌ అభిమానుల మనసు దోచుకున్నాడని.. టీమిండియా తర్వాతే తన ఐపీఎల్‌ జట్టు అని కోహ్లి మరోసారి చాటాడని చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జడేజా 10 వికెట్లతో విజృంభించడంతో ఆసీస్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో పేకమేడలా కూలింది.    

Videos

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?