amp pages | Sakshi

Test Captain: కోహ్లి కంటే రోహిత్‌ గొప్ప టెస్టు కెప్టెన్‌ అవుతాడు: భారత మాజీ క్రికెటర్‌

Published on Wed, 03/16/2022 - 11:10

Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ప్రశంసలు కురిపించాడు. విరాట్‌ కోహ్లి కంటే కూడా రోహిత్‌ గొప్ప టెస్టు కెప్టెన్‌ అవుతాడని పేర్కొన్నాడు. కాగా కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్‌మాన్‌ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసింది.

ఈ క్రమంలో రోహిత్‌ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మను కొనియాడాడు. ‘‘రోహిత్‌ ఎన్ని టెస్టులకు సారథ్యం వహిస్తాడో తెలియదు కానీ.. విరాట్‌ కోహ్లి కంటే అతడు మెరుగైన టెస్టు కెప్టెన్‌ అవుతాడు. వరుస సిరీస్‌లను వైట్‌వాష్‌ చేయడం చూస్తున్నాం. 

రోహిత్‌ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలవడం ఖాయం. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ప్రస్తుతం సరైన వ్యక్తి చేతిలో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని వసీం జాఫర్‌ చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించి 40 విజయాలు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి టీమిండియా అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు. ఇక 34 ఏళ్ల రోహిత్‌ శర్మ ప్రస్తుతం సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.

చదవండి: Pak Vs Aus 2nd Test: బాబర్‌ ఆజమ్‌ సెంచరీ.. సూపర్‌ అంటూ అశ్విన్‌ ట్వీట్‌

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)