amp pages | Sakshi

అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక​.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..?

Published on Sat, 08/27/2022 - 18:15

ఆసియా కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్‌ వేదికగా శనివారం (ఆగస్టు 27) శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక​.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..? జట్లు తలపడనున్నాయి. స్థానిక టీ20 టోర్నీలో పాల్గోని మంచి ఊపు మీద ఉన్న శ్రీలంక.. టైటిలే లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు  ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

హాట్‌ ఫేవరేట్‌గా శ్రీలంక
దాసున్ షనక సారథ్యంలో శ్రీలంక జట్టు హాట్‌ ఫేవరేట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. శ్రీలంక బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆ జట్టు యువ ఆటగాళ్లు పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా  కెప్టెన్‌ షనక కూడా తనదైన రోజున బ్యాట్‌ ఝుళిపించే సత్తా ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. స్టార్‌ పేసర్‌ దుషాంతా చమీరా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ అనే చేప్పుకోవాలి.

పేస్‌ బౌలింగ్‌ విభాగంలలో చమిక కరుణరత్నే తప్ప చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ కనిపించడం లేదు. ఇక స్పిన్‌ బౌలింగ్‌లో వానిందు హసరంగా వంటి స్టార్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. అతడితో పాటు మహేశ్ తీక్షణ వంటి యువ స్పిన్నర్‌ రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. కాగా ఈ మెగా ఈవెంట్‌కు ముందు స్థానిక టీ20 టోర్నీలో లంక ఆటగాళ్లు పాల్గోనడం ఆ జట్టుకు సానుకూలాంశం

బౌలింగ్‌లో తడబడుతున్న అఫ్గనిస్తాన్‌!
ఆఫ్ఘనిస్థాన్‌ విషయానికి వస్తే..  అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ పరంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటకీ.. బౌలింగ్‌లో మాత్రం తడబడుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే పునరావృతమైంది. ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌లో హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండగా.. మిడిలార్డర్‌లో గని, నజీబుల్లా జద్రాన్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. రషీద్‌ ఖాన్‌, నవీన్-ఉల్-హక్ మినహా బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. ఇక ఆఫ్గాన్‌ కెప్టెన్‌ నబీ ఫామ్‌ ఆ జట్టును కలవరపెడుతోంది. నబీ ఐర్లాండ్‌ సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

పిచ్‌ రిపోర్ట్‌:
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలో కొత్త బంతితో బౌలర్లు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి.

హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు
అంతర్జాతీయ టీ20ల్లో ఇరు జట్లు ముఖాముఖి ఒకే సారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది.
చదవండి: Asia Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్‌.. పాకిస్తాన్‌ సీనియర్‌ పేసర్‌ రీ ఎంట్రీ!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌