amp pages | Sakshi

Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. 

Published on Wed, 01/12/2022 - 20:45

IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్‌ రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో వికెట్‌ కీపర్‌ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్‌ బ్యాటర్‌ కాలేడని అభిప్రాయపడ్డాడు. 

ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్‌ కీపింగ్‌ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్‌ చరిత్రలో ఏ వికెట్‌ కీపర్‌ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు.  

కీపింగ్‌ చేసి ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్‌ చేస్తే.. కీపింగ్‌ చేసి మళ్లీ  ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం​ అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్‌ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్‌ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 
చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)