amp pages | Sakshi

Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్‌

Published on Sat, 07/09/2022 - 02:58

లండన్‌: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్‌ స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్‌ కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై విజయం సాధించాడు.

ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్‌ నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్‌ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్‌తో తలపడాల్సిన రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్‌ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ ఫైనల్‌   ఆడనున్నాడు.
 
తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌ రెండో సెట్‌ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్‌ నెట్‌ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్‌ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్‌ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌