amp pages | Sakshi

CWC 2022: వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు

Published on Wed, 03/30/2022 - 12:51

ICC women World Cup 2021: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్‌.. సెమీస్‌లోనూ జయభేరి మోగించింది. అజేయ రికార్డును కొనసాగిస్తూ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. 

న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. అయితే, వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్‌(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్‌ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్‌ డియాండ్ర డాటిన్‌ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్‌ 34, కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్‌ అయి వెస్టిండీస్‌ కుప్పకూలింది. 157 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హేలీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022
తొలి సెమీ ఫైనల్‌
ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ మ్యాచ్‌ స్కోర్లు
ఆస్ట్రేలియా- 305/3 (45)
వెస్టిండీస్‌- 148 (37)

చదవండి: SRH Vs RR: 8 కోట్లు పెట్టి కొన్నది ఎనిమిదో స్థానంలో ఆడించడానికా? పూరన్‌పై మీకు నమ్మకం.. కానీ

Videos

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)