amp pages | Sakshi

World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్‌

Published on Sun, 09/18/2022 - 04:40

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో భారత స్టార్‌ రెజర్ల్, బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత బజరంగ్‌ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో 0–10తో జాన్‌ మైకేల్‌ డియాకొమిహాలిస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్‌ ప్రిక్వా ర్టర్‌ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్‌ వాల్డెస్‌ (క్యూబా)పై గెలుపొందాడు.

బజరంగ్‌ను ఓడించిన జాన్‌ మైకేల్‌ ఫైనల్‌ చేరడంతో ‘రెపిచాజ్‌’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్‌జెన్‌ తెవాన్యన్‌ (అర్మేనియా), వ్లాదిమిర్‌ దుబోవ్‌ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్‌’ తొలి రౌండ్‌లో బజరంగ్‌ తలపడతాడు. ఈ బౌట్‌లో బజరంగ్‌ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్‌ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్‌ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్‌ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు.  

మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ సాగర్‌ జగ్లాన్‌ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్‌ యూనస్‌ అలీఅక్బర్‌ (ఇరాన్‌)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో సాగర్‌ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్‌ (61 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్‌ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)