amp pages | Sakshi

ఐపీఎల్‌-2023లో అత్యంత చెత్త బౌలర్‌ ఎవరు..?

Published on Sun, 05/28/2023 - 10:16

ఐపీఎల్‌లో బ్యాటర్లు రాజ్యమేలే ఆనవాయితీ ఈ సీజన్‌లోనూ కొనసాగింది. ఫాస్ట్‌ బౌలర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి బౌలర్‌ను బ్యాటర్లు చితకబాదారు. షమీ, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ లాంటి బౌలర్లు వికెట్లయితే పడగొట్టారు కానీ, పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ముంబై పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ లాంటి బౌలర్లు ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (5/5) నమోదు చేసి, ఆ మరుసటి మ్యాచ్‌లోనే (4-0-52-1) తేలిపోయారు. ఇలాంటి ఘటనలు 73 మ్యాచ్‌ల్లో చాలా సందర్భాల్లో రిపీటయ్యాయి.  

ఐపీఎల్‌-2023లో కనీసం 20 ఓవర్లు బౌల్‌ చేసి, అత్యంత చెత్త ఎకానమీ నమోదు చేసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం..
 

  • ఉమ్రాన్‌ మాలిక్‌.. 4 కోట్లు పెట్టి సన్‌రైజర్స్‌ తిరిగి దక్కించుకున్న ఈ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఈ సీజన్‌లోకెల్లా అత్యంత చెత్త ఎకానమీ (8 మ్యాచ్‌ల్లో 10.85 ఎకానమీతో 5 వికెట్లు) కలిగిన బౌలర్‌గా నిలిచాడు.
  • ఆ తర్వాతి స్థానంలో ముంబై పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ (6 మ్యాచ్‌ల్లో 10.77 ఎకానమీతో 3 వికెట్లు) ఉన్నాడు. ఈ ముంబై పేసర్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని తన జట్టు ఓటములకు ప్రధాన కారకుడిగా నిలిచాడు. 
  • విజయ్‌కుమార్‌ వైశాక్‌.. ఈ ఏడాదే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ ఆర్సీబీ పేసర్‌ 7 మ్యాచ్‌ల్లో 10.54 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.  
  • ముకేశ్‌ కుమార్‌.. ఈ ఏడాదే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ పేసర్‌ 10 మ్యాచ్‌ల్లో 10.52 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.
  • శార్దూల్‌ ఠాకూర్‌.. ఈ ఏడాది వేలానికి ముందు భారీ ధరకు ట్రేడ్‌ అయిన ఈ కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 10.48 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్‌ 2023లో చెత్త ఎకానమీ కలిగిన టాప్‌-5 బౌలర్లంతా పేసర్లే కాగా.. బెస్ట్‌ ఎకానమీ కలిగిన టాప్‌-4 బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. కనీసం 20 ఓవర్లు బౌల్‌ చేసి ఐపీఎల్‌ 2023 బెస్ట్‌ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో అక్షర్‌ పటేల్‌ (14 మ్యాచ్‌ల్లో 7.19 ఎకానమీతో 11 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ (14 మ్యాచ్‌ల్లో 7.37 ఎకానమీతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (15 మ్యాచ్‌ల్లో 7.42 ఎకానమీతో 19 వికెట్లు), కృనాల్‌ పాండ్యా (15 మ్యాచ్‌ల్లో 7.45 ఎకానమీతో 9 వికెట్లు) టాప్‌-4లో ఉన్నారు. 

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి, పర్పుల్‌ క్యాప్‌ దక్కించుకున్న బౌలర్‌గా గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రషీద్‌ ఖాన్‌ (16 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు), మోహిత్‌ శర్మ (13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) టాప్‌-3 బౌలర్లుగా ఉన్నారు. ఐపీఎల్‌ 2023లో టాప్‌-3 బౌలర్లంతా గుజరాత్‌కు చెందిన వారే కావడం విశేషం. వీరి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 

చదవండి: ఐపీఎల్‌ 2023లో అతి పెద్ద సర్‌ప్రైజ్‌ ఎవరు..?

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌