amp pages | Sakshi

WPL: ‘శక్తి’మంతంగా డబ్ల్యూపీఎల్‌ ఆంథెమ్‌.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం!

Published on Thu, 03/02/2023 - 11:26

Women's Premier League 2023 Anthem: భారత క్రికెట్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ నిర్వహించనున్న మహిళా ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)కు సమయం ఆసన్నమైంది. ఐదు ఫ్రాంఛైజీలకు సంబంధించిన జట్లతో కూడిన టీ20 లీగ్‌ మార్చి 4న ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌తో ప్రారంభ సీజన్‌కు తెరలేవనుంది. 

మహిళా శక్తికి అద్దం పట్టేలా
ఈ నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్‌ ఆంథెమ్‌ను విడుదల చేసింది. ‘‘యేతో బస్‌ షురువాద్‌ హై (ఇది కేవలం ఆరంభం మాత్రమే)’’ అంటూ మొదలైన ఈ గీతం అమ్మాయిల సంకల్ప బలానికి, మహిళా శక్తికి అద్దం పట్టేలా సాగింది. కఠిన సవాళ్లను ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగుతున్న మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా స్ఫూర్తిదాయక పదాల కూర్పుతో అద్భుతంగా ఉంది.

గూస్‌బంప్స్‌ రావడం ఖాయం
మహిళా క్రికెటర్లు ఎవ్వరికీ తీసిపోరని, అంకితభావంతో వాళ్లు ఇక్కడిదాకా చేరిన తీరుకు నిదర్శనంగా నిలిచింది. అందుకు తగ్గట్లే సంగీతం కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ పాట వింటే గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. మహిళా శక్తిని వివరిస్తూ ‘‘జాగీ హుయీ శక్తి అబ్‌ మేరే పాస్‌ హై, దేఖో అభి, యేతో బస్‌ షురువాద్‌ హై!’’ అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఈ పాటను మీరు కూడా వినేయండి!

మహిళా దినోత్సవానికి ముందే మరో కానుక
‘‘యా దేవి సర్వభూతేశు,
శక్తి రూపేన సమస్థితా
నమస్తస్యయై
నమస్తస్యయై
నమస్తస్యయై
నమస్తస్యయై

నమస్తస్యయై.. నమో నమః
ధమ్‌ ధమ్‌ ధ మ మ ధమ్‌
ధమ్‌ ధమ్‌ ధ మ మ ధమ్‌ ధమ​ మైదాన్‌ మే
గూంజే మేరీ శక్తి అబ్‌ ఆస్మాన్‌ మే
’’ అంటూ నేటితరం ఆడబిడ్డలకు సవాళ్లు స్వీకరించడం ఓ అలవాటులా మారిపోయిందని.. విజయగర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ.. ఆకాశమే హద్దుగా ఆటలో తమను తాము నిరూపించుకుంటామంటూ సాగిన పాట జోష్‌ నింపుతోంది. నెటిజన్లు ఈ గీతానికి ఫిదా అవకుండా ఉండలేకపోతున్నారు. మహిళా దినోత్సవానికి ముందే మహిళా క్రికెటర్లకు అద్భుతమైన పాట రూపంలో కానుక ఇచ్చారంటూ బీసీసీఐని కొనియాడుతున్నారు.

చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా 
Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్‌ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్‌ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా?

Videos

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)