amp pages | Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI)ను ఆశ్రయించిన ఆసీస్‌

Published on Thu, 06/08/2023 - 11:27

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ ప్రారంభానికి ముందు, ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI)ను ఆశ్రయించారు. ఏఐ నుంచి ఆసీస్‌కు అనుకూలమైన సమాధానం వచ్చింది. ఆసీస్‌ గెలుపు ఖాయమని ఏఐ కుండ బద్దలుకొట్టి చెప్పింది. అయితే ఏఐ సమాధానాన్ని వర్ణించిన తీరు మాత్రం తికమకపెట్టేదిగా ఉంది. ఏఐ చెప్పిన సమాధానాన్ని ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌ ఇన్‌స్టా ఖాతా ద్వారా వివరించారు.
 
ఏఐ సమాధానం​ కమిన్స్‌ మాటల్లో.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా నరాలు తెగే ఉత్కంఠ పోరులో తలపడ్డాయి. సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్‌ అసాధారణ వ్యూహాన్ని అమలు చేసింది. వారి బ్యాటింగ్ ఆర్డర్ తారుమారైంది. 

ఏఐ సమాధానం​ హాజిల్‌వుడ్‌‌ మాటల్లో.. ఆసీస్‌ ఓపెనింగ్‌ జోడీ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లయోన్‌ గార్డ్‌ తీసుకున్నారు. హాజిల్‌వుడ్‌.. తన అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించి సొగసైన బౌండరీలు బాది సాహసోపేతమైన ఛేజింగ్‌కు నాంది పలికాడు. ఆసీస్‌ సాంప్రదాయేతర విధానానికి అమలు చేయడంతో టీమిండియా విస్మయానికి గురై లయ కోల్పోయింది.

ఏఐ సమాధానం​ కమిన్స్‌ మాటల్లో.. కమిన్స్ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. అతని నిర్భయ ఉద్దేశం ఆసీస్ శిబిరంలో నమ్మకాన్ని తీసుకువచ్చింది. కమిన్స్‌ ఆడిన ప్రతి షాట్‌ ఆసీస్‌ను విజయానికి చేరువ చేసింది. ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో లయోన్‌ సిక్సర్‌ బాది ఆసీస్‌ను గెలిపించాడు. అసాధారణ వ్యూహాన్ని  అమలు చేసి ఆసీస్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 

కాగా, ఏఐ ‍తలా తోక లేని సమాధాన్ని పక్కన పెడితే.. తొలి రోజు మాత్రం ఆసీస్‌దే పైచేయగా ఉంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (146 నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌ (95 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.

చదవండి: WTC Final: అంచనా తప్పింది.. అశ్విన్‌ను పక్కకు పెట్టి మూల్యం చెల్లించుకుంది..!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)