amp pages | Sakshi

Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!!

Published on Mon, 11/06/2023 - 11:01

WC 2023- Virat Kohli 49th Century: తొమ్మిది వేర్వేరు దేశాలపై సెంచరీలు... శ్రీలంకపై అత్యధికంగా 10... వెస్టిండీస్‌పై 9, ఆస్ట్రేలియాపై 8, న్యూజిలాండ్‌పై 5, బంగ్లాదేశ్‌పై 5, దక్షిణాఫ్రికాపై 5, పాకిస్తాన్‌పై 3, ఇంగ్లండ్‌పై 3, జింబాబ్వేపై ఒకటి..

అంతర్జాతీయ వన్డేల్లో.. టీమిండియా ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి శతకాల రికార్డు ఇది.. అద్భుతమైన తన ఆట తీరుతో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఒంటిచేత్తో గెలుపు తీరాలకు చేర్చడమెలాగో తనకు తెలుసు..

కీలక సమయంలో అనవసరపు షాట్లకు పోయి వికెట్‌ పారేసుకోవడం తనకు ఇష్టం ఉండదు.. సింగిల్స్‌ తీస్తూ అయినా సరే లక్ష్యానికి చేరుకోవడంపై మాత్రమే తన దృష్టి.. 

మిగతా బ్యాటర్లు విఫలమైన చోట తాను ఒక్కడైనా పట్టుదలగా నిలబడి టీమ్‌ను గెలిపించాలనే తపన తప్ప తనకు ఇంకేమీ పట్టదు.. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు, అరుదైన మైలురాళ్లను చేరుకున్న సందర్భాలు..

క్రికెట్‌ కింగ్‌కు ఎదురులేదు
ఇలా ఇప్పటికే క్రికెట్‌ ‘కింగ్‌’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న కోహ్లి.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా చారిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.

పటిష్ట సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 49వ సెంచరీ సాధించి క్రికెట్‌ దేవుడు, టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేసి శిఖరాగ్రాన నిలిచాడు.

స్వార్థపరుడంటూ విమర్శలు
దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటగా.. కొంతమంది విమర్శకులు మాత్రం కోహ్లిని స్వార్థపూరితమైన క్రికెటర్‌గా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కోహ్లి జట్టు ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాడనేది వారి అభిప్రాయం.

అయితే, కోహ్లి కెరీర్‌, అతడి ఆట తీరును సునిశితంగా గమనించిన వాళ్లకు ఇలాంటి మాటలు ఆగ్రహం తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.

కోహ్లి స్వార్థపరుడన్న వాళ్లకు దిమ్మతిరిగేలా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి పరితపించిపోతున్నాడు. అతడొక స్వార్థపరుడు అంటూ కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు.

అవును.. కోహ్లి స్వార్థపరుడే..
కోట్లాది మంది కలలను నిజం చేయడంలో అతడు పూర్తి స్థార్థంగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటికే ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించినా..
కొత్త కొత్త బెంచ్‌మార్కులు సెట్‌చేస్తూ ముందుకు సాగుతున్నందుకు

అరుదైన ఘనతలెన్నో సాధించినా...
జట్టును గెలిపించేందుకు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నందుకు..
అవును.. నిజంగానే కోహ్లి స్వార్థపరుడు
’’
అంటూ జట్టు గురించే ఎక్కువగా ఆలోచించే కోహ్లిని ఇలా అనడం సరికాదంటూ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఉద్వేగపూరిత నోట్‌ రాశాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారగా.. విరాట్‌ కోహ్లి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: మాకు ఎటువంటి స్పెషల్‌ ప్లాన్స్‌ లేవు.. అతడొక ఛాంపియన్‌! జడ్డూ కూడా: రోహిత్‌ శర్మ
మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ 
  

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు