amp pages | Sakshi

ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్‌.. రెండో స్థానంలో సమ్మర్‌ ఒలింపిక్స్‌

Published on Tue, 02/01/2022 - 15:16

క్యాచ్‌రిచ్‌ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్‌ 2022 స్పోర్ట్స్‌ బజ్‌ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్‌ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్‌(సమ్మర్‌ ఒలింపిక్స్‌) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ ఇచ్చినట్లు యుగోవ్స్‌ తెలిపింది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్‌ స్పోర్ట్స్‌ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్‌ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఐపీఎల్‌దే తొలిస్థానం. 

►ఇక ఐపీఎల్‌ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్‌. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్‌ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. 

►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్‌-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం.

►ఈ మూడింటి తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌(28.3 పాయింట్లు), ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(20.4 పాయింట్లు), వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌(టెన్నిస్‌, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్‌ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్‌ గేమ్స్‌ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి.   ఇ​క యుగోవ్స్‌ తమ ర్యాంకింగ్స్‌ను స్పోర్ట్స్‌ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్‌ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)