amp pages | Sakshi

తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్‌ మృతి

Published on Sat, 10/16/2021 - 11:04

Young Saurashtra Cricketer Avi Barot Dies: క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్‌ అవి బరోట్‌ మరణించాడు. 29 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశాడు. సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని ప్రతి ఒ​క్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్‌ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అని బాధాతప్త హృదయంతో మీడియాకు ప్రకటన విడుదల చేసింది. 

కాగా కుడిచేతి వాటం గల అవి బరోట్‌... అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌(2011)గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. బరోట్‌ 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 38 లిస్ట్‌-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అయిన బరోట్‌... ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్‌-ఏ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా అవీ బరోట్‌ ఆకస్మిక మరణం పట్ల ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ​ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బరోట్‌ ఎంతో మంచి వాడని, అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.

చదవండి: Team India Coach: రాహుల్‌ ద్రవిడ్‌ ఒప్పేసుకున్నారు.. ఇకపై హెడ్‌ కోచ్‌గా?!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)