amp pages | Sakshi

థ్రిల్లర్‌ను తలపించిన టీ20; 3 పరుగులతో జింబాబ్వే విజయం

Published on Sat, 08/28/2021 - 11:12

డుబ్లిన్‌: జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 3 పరుగులతో విజయాన్ని అందుకుంది. లోస్కోరింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసిది. వికెట్‌ కీపర్‌ చకాబ్వా 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ క్రెగ్‌ ఎర్విన్‌ 17 పరుగులు, మసకద్జ 19* పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలింగ్‌లో క్రెయిగ్‌ యంగ్‌, సిమీ సింగ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. బారీ మెక్‌కార్తీ, గెట్‌కటే తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది.

చదవండి: ENG Vs IND: స్పిన్‌ బౌలింగ్‌.. అయినా క్యాప్స్‌ ధరించలేదు

ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ 25, కెవిన్‌ ఒబ్రియాన్‌ 25 పరుగులతో శుభారంభం అందించినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. అయితే చివర్లో సిమీ సింగ్‌ 28 పరుగులతో నాటౌట్‌ నిలిచి ఐర్లాండ్‌ విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికి గరవ వేసిన ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిమీ సింగ్‌కు బ్యాటింగ్‌ రాకుండా చేయడంలో జింబాబ్వే సఫలమయింది. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను ఒత్తిడికి గురిచేసింది. ఆఖరి బంతికి నాలుగు పరుగుల అవసరమైన దశలో సిమీ సింగ్‌ ఒక​ పరుగు మాత్రమే చేయడంతో ఐర్లాండ్‌ మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే బౌలర్లలో రియాన్‌ బర్ల్‌ 3, మసకద్జ 2, లూక్‌ జోంగ్వే 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌ విజయంతో జింబాబ్వే ఐదు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 

చదవండి: ఇంగ్లండ్‌ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?