amp pages | Sakshi

ప్రతిభ ఉంటే అవార్డులు వరిస్తాయి

Published on Sat, 08/26/2023 - 02:04

సాహిత్యాన్ని అలవర్చుకోవాలి

నేటి యువత సమయం లేదని సాహిత్యం పట్ల ఆసక్తి చూపడం లేదు. సాహిత్యంలో రచనలు, అధ్యయనాలు పెరగాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య, భారత సంగీతాల మూలం శాసీ్త్రయ సంగీతమే. సంగీతం వల్ల తాత్కాలిక ఆనందం పొందడం కాకుండా అందులోని సాహిత్యాన్ని ఆస్వాదించాలి. మనలో ప్రతిభ లేకుంటే ఏమీ సాధించలేము. ప్రతిభ ఉంటేనే అవార్డులు, ప్రశంసలు వస్తాయి.

రామగిరి(నల్లగొండ): జాతీయ చలన చిత్ర అవార్డుకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ ముడుంబై పురుషోత్తమాచార్య ఎంపికయ్యారు. గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు–2021కి గాను ఉత్తమ సినీ విమర్శుకుడి కేటగిరీలో ఆయనకు అవార్డు దక్కింది. జాతీయ చలన చిత్ర ఉత్తమ సినీ విమర్శుకుడిగా ఎంపికై న సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లో..

నేను హుజూర్‌నగర్‌లో జన్మించాను. నాన్న వెంకటనరసింహాచార్యులు సంగీత విద్వాంసుడు. తాత రంగాచార్యులు సంస్కృత పండితుడు కావడంతో నాకు చిన్న నాటి నుంచే సంగీతంతో పాటు సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. 1975 సంవత్సరంలో నల్లగొండ పట్టణానికి వచ్చి స్థిర పడ్డాను. తెలుగు సబ్జెక్టులో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎం.ఏ) చదివాను. అనంతరం చందాల కేశవదాసు సాహిత్యంపై పరిశోధన చేసినందుకు గాను 2003వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో డాక్టరేట్‌ పొందాను.

26 రచనలు..

ఇప్పటి వరకు 26 రచనలు చేశాను. అందులో వచన, పద్య, గేయాలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు ఉన్నాయి. భక్తి గీతాలు, జోగులాంబ చరిత్ర, రేణుకా ఎల్లమ్మ చరిత్రను పాటల రూపంలో రికార్డింగ్‌ చేశాను. 1982 సంవత్సరంలో అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితిని స్థాపించి ప్రతి నెల 16 తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గాయకులతో అన్నమయ్య సంకీర్తనలో సంగీత విభావరి నిర్వహిస్తున్నా. ఇటీవల 500 నెలల కార్యక్రమం పూర్తయింది. 1989లో నాద బ్రహ్మ సంగీత కళాశాలను ఏర్పాటు చేశాను. సంగీత సాహిత్యంలో చేసిన సేవలకు గాను ఇప్పటి వరకు సముద్రాల, ఆత్రేయ, కరుణశ్రీ, ఘంటసాల, కెఎల్‌ నర్సింహారావు అవార్డులు పొందాను. కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారులు, జావలీలు, హరికథలు, యక్షగానాలు సినిమాల్లోకి అనువందించబడ్డ తీరు, సాహిత్య పరంగా అందులో ఉన్న విలువలను వ్యాసాల రూపంలో మిసిమి మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. 2021 జనవరి నుంచి జూన్‌ వరకు ప్రచురితమైన వ్యాసాలను 2023 మే నెలలో జాతీయ చలన చిత్ర అవార్డు కోసం దరఖాస్తు చేశాను. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసి ఉత్తమ సినీ విమర్శుకుడిగా అవార్డు ప్రకటించారు.

ఫ శాసీ్త్రయ సంగీతమే అన్నింటికి మూలం

ఫ యువత సాహిత్యంపై దృష్టిపెట్టాలి

జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీత

డాక్టర్‌ పురుషోత్తమాచార్య

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)