amp pages | Sakshi

Hyderabad Marathon: లింగం.. మారథాన్‌ సింగం! హార్ట్‌ పేషెంట్‌ అయినా..

Published on Mon, 08/28/2023 - 09:01

సాక్షి, హైదరాబాద్‌: లింగం వయసు 50 ఏళ్లు. ఫుల్‌ మారథాన్‌ (42 కిలోమీటర్లు) పూర్తి చేశాడు. ఇది అంత పెద్ద విశేషమేమీ కాదు...కానీ అతను వెల్డింగ్‌ పనిచేసే సామాన్యమైన కార్మికుడు. అంతేకాదు హార్ట్‌ పేషెంట్‌ కూడా. హైదరాబాద్‌లోని కూకట్‌­పల్లిలో నివసించే లింగం ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన హైదరాబాద్‌ మారథాన్‌లో పాల్గొని ఫుల్‌ మారథాన్‌ పూర్తి చేశారు. అయితే  ఈ ఘనత  సాధించిన  హార్ట్‌ పేషెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా లింగం, ఆయనకు వైద్యం చేసిన డా.మురళీధర్‌ బాబీ  ‘సాక్షి’తో ఆ వివరాలు పంచుకున్నారు. 

కరోనా అనుకుంటే...
వెల్డర్‌గా పనిచేస్తున్న లింగం రెండేళ్ల క్రితం తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఇఎస్‌ఐ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అయితే ఈ సమస్యకు కారణం కరోనా అని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే పరీక్షల అనంతరం వైద్యులు ఇది కరోనా కాదని, పల్మనరీ ఆర్టీరియల్‌ హైపర్‌టెన్షన్‌ అని..అప్పటికే లింగంకు తెలియకుండా రెండుసార్లు స్ట్రోక్స్‌ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. ఆయనకు కొన్ని మందులు రాసిచ్చి వాడమన్నారు. కొద్దిరో­జుల తర్వాత నిమ్స్‌కు రిఫర్‌ చేశారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్‌ తదితర పరీక్షలు చేసి బ్లాక్స్‌ లేవని, అయితే ఆయన గుండెకు పంపింగ్‌  సామర్థ్యం బాగా తక్కువగా..అంటే 18కి దిగిపోయిందని డాక్టర్లు తేల్చారు. 

రిహాబ్‌తో రీచార్జ్‌ 
డాక్టర్‌ మురళీధర్‌ నిర్వహించే కార్డియాక్‌ రిహాబ్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌లో లింగం చేరారు. అక్కడ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల మందులు, చికిత్సలతో పాటుగా రెగ్యులర్‌గా ట్రెడ్‌మిల్‌ వ్యాయామం, ఆహారంలో రైస్‌ బాగా తగ్గించి కాయ­గూరలు, మొలకలు వంటివి బాగా పెంచారు. తద్వా­రా పంపింగ్‌ సామర్థ్యాన్ని 53 శాతానికి మెరుగుపరిచారు. ఫలితంగా గత ఏడాదిలో జరిగిన హాఫ్‌ మారథాన్‌ పూర్తి చేసిన లింగం...మంచి అల­వాట్లు కొనసాగిస్తూ గుండెను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుల్‌ మారథాన్‌ను కూడా పూర్తి చేయగలిగారు. 
చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?