amp pages | Sakshi

నిజామాబాద్‌: షాపింగ్‌మాల్‌లో 75 మందికి కరోనా!

Published on Sun, 04/04/2021 - 15:18

సాక్షి, నిజామాబాద్‌: షాపింగ్‌ మాల్స్‌ కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోనే అధికంగా కేసులు నమోదవుతుండడంతో వైరస్‌ నియంత్రణ కోసం టెస్టుల సంఖ్యను పెంచారు. వైరస్‌కు హాట్‌స్పాట్లుగా ఉండే చోట్ల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వ్యాపార సముదాయాలలో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో షాపింగ్‌ మాల్స్‌లో చాలామందికి పాజిటివ్‌ వస్తోంది. దీంతో షాపింగ్‌ మాల్స్‌ వైరస్‌కు నిలయాలుగా మారుతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌లో ర్యాపిడ్‌ టెస్టులు జిల్లాలో కేసుల విృజంభణ దృష్ట్యా ఆరోగ్య శాఖ అధికారులు నియంత్రణ చర్యలు భాగంగా విసృతంగా ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రతి వ్యాపార సముదాయంలో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. దీంతో కొన్ని రోజులుగా నగరంలోని షాపింగ్‌ మాల్స్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వీటిలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని బస్‌స్టాండ్ ‌సమీపంలో గల ఓ షాపింగ్‌ మాల్స్‌లో ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది రెండు రోజులపాటు సుమారు 190 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా మొత్తం 75 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా శనివారం వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయంలో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు సముదాయాల్లోనే 89 మందికి కోవిడ్‌ సోకినట్లు తేలింది.

నిబంధనలు గాలికి..
ప్రతిరోజూ వందలాది మంది వచ్చే వ్యాపార సముదాయాల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. చాలా వాటిల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. మాసు్కలు ధరించడం, శానిటైజేషన్‌, భౌతిక దూరం అమలు కావడంలేదు. ప్రజలు సైతం మాసు్కలు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయినా షాపింగ్‌ మాల్స్‌ నిర్వాహకులు సైతం కనీస సూచనలు చేయడంలేదు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే షాపింగ్‌ మాల్స్‌లో నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది.

నివారణ చర్యలు ఎక్కడ ?
అత్యధిక కేసులు నమోదవుతున్న షాపింగ్‌ మాల్స్‌లో నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఓ వస్త్ర దుకాణంలో 75 మందికి పాజిటివ్‌ వస్తే వైద్యారోగ్య శాఖ కనీస చర్యలు తీసుకోలేదు. నిబంధనల ప్రకారం షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాల్సి ఉన్నా యధావిధిగా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

చదవండి: ప్రముఖ నటుడు సోనూసూద్‌ పేరుతో భారీ మోసం..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)