amp pages | Sakshi

రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం

Published on Fri, 09/03/2021 - 03:54

చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్‌ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు.

బండి సంజయ్‌ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు.

అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు.

మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్‌ఎస్‌ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్‌ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు.  

వికారాబాద్‌ జిల్లాలో సంజయ్‌కి ఘన స్వాగతం 
పూడూరు: బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్‌ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్‌ ఆవిష్కరించారు. ధరణి కాటన్‌ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)