amp pages | Sakshi

పోటీనా.. పార్టీ పదవుల్లోనా?

Published on Tue, 06/07/2022 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారు, అందుకు ఆసక్తి లేనివారు త్వర గా తేల్చుకోవాలంటూ రాష్ట్ర నాయకులకు బీజేపీ జాతీయ నాయకత్వం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రస్థాయి పదాధికారులు మొదలు ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షుల దాకా అసెంబ్లీ లేదా లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆలోచన ఉంటే పార్టీ పదవులు వదులుకునే విషయంలో త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. పోటీకి ఆసక్తి చూపని ముఖ్య, ఇతర నేతలు పార్టీ అప్పగించే బాధ్యతలను అంకితభావంతో నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆదేశించింది.

ఏడాదిన్నరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పార్టీనాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందున ఆ దిశలో రాష్ట్రపార్టీ ఎన్నికల కార్యాచరణ, అన్ని శాసనసభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని పోలిం గ్‌బూత్‌ స్థాయిలో పార్టీ పటిష్టత, వివిధ స్థాయిల కమిటీల నియామకం వంటివి పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్దేశించింది. తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించ డంలేదని, కార్యక్రమాల నిర్వహణలో పాత్ర ఉండటం లేదని సీనియర్‌ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కొ క్కరిని ఒక లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల స్వశక్తీకరణ పర్యవేక్ష కులుగా నియమించే దిశలో రాష్ట్రపార్టీ చర్యలు చేపడుతోంది. వీరితోపాటు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌ ల స్వశక్తీకరణ్‌ కార్యక్రమాల నిర్వహణకు కోఆర్డినేటర్లను నియమించనుంది. 

కుటుంబసభ్యులకు నో టికెట్‌!: ఎన్నికల సందర్భంగా కుటుంబ, వారసత్వ రాజకీ యాలకు బీజేపీ దూరంగా ఉంటుం దనే స్పష్టమైన సందేశాలు, ఆదేశాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జారీచేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కష్టపడి పనిచేసే నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తుందే తప్ప నేతల కుటుంబసభ్యులకు ఎన్నికల్లో పోటీకి ప్రాధాన్యమివ్వబోమని స్పష్టం చేశారు. ఇదే పార్టీ విధానమని, దీనినే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ అమలు చేయబోతు న్నట్టు తాజాగా రాష్ట్ర నేతలకు నడ్డా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విధానాన్ని మధ్యప్రదేశ్, యూపీ ఎన్నికల్లోనూ అనుస రించామని, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ దీనినే పాటిస్తామని నడ్డా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కుటుంబపార్టీలతో పోల్చితే బీజేపీ కుటుంబ, వారసత్వ పార్టీ కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌