amp pages | Sakshi

బల్క్‌ డీజిల్‌ ఝలక్‌

Published on Wed, 03/02/2022 - 04:56

సాక్షి, హైదరాబాద్‌:     ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దీని ప్రభావం బల్క్‌ డీజిల్‌పై పడింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్‌ కంపెనీలు బల్క్‌ డీజిల్‌ ధరను పెంచుతూ పోతున్నాయి. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో బల్క్‌ డీజిల్‌« లీటర్‌ ధర రూ.103.70కి చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రిటైల్‌ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రస్తుతం లీటర్‌ రూ.94.62కు లభ్యమవుతోంది. దీంతో బల్క్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోగా, రిటైల్‌ విక్రయాలు పెరిగాయి. సాధారణంగా బల్క్‌ డీజిల్‌ ధరలు తక్కువగా ఉంటాయి.

నెల క్రితం వరకు బల్క్‌ డీజిల్‌పై నాలుగు నుంచి ఐదు శాతం వరకు రాయితీ లభించేది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో కంటే లీటరుపై రూ.4 నుంచి రూ.5 వరకు తక్కువకు డీజిల్‌ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మరోవైపు డిస్కౌంట్‌ను కూడా చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో బల్క్‌ డీజిల్‌ను విరివిగా కొనుగోలు చేసే ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలు రిటైల్‌ పెట్రోలు బంకులను ఆశ్రయిస్తున్నాయి. బల్క్‌ డీజిల్‌ వినియోగంలో హైదరాబాద్‌ నగర వాటా 60 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద నెలకు బల్క్‌లో డీజిల్‌ అమ్మకాలు 67,800 కిలో లీటరు వరకు ఉంటే అందులో నగరంలోని సంస్ధల నుంచే 40,680 కిలో లీటర్లు వరకు ఉంటాయని అంచనా.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌