amp pages | Sakshi

కోనాయిపల్లిలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు 

Published on Sun, 11/05/2023 - 05:30

సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు సెంటిమెంట్‌ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్‌ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వస్వామిని దర్శించుకుని, నామినేషన్‌ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

తర్వాత అర్చకులు సీఎంకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి సన్నిధిలోనే గజ్వేల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలుచేసి, వాటిపై సంతకం చేశారు. తర్వాత కేసీఆర్, హరీశ్‌రావు ఆలయం నుంచి బయటికి రాగా.. గ్రామ మహిళలు వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. సుమారు 1.15 గంటల సమయంలో వారు తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. 

Videos

Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ

ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి

కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..

మంగళగిరిలో సీఎం జగన్ సభ

టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్

మత్స్యకారులకు గుడ్ న్యూస్

టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..

చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు