amp pages | Sakshi

నిర్లక్ష్యపు నడక, బైకర్‌ అతివేగం.. మీరు మారరా!

Published on Mon, 02/22/2021 - 08:37

సాక్షి, హైదరాబాద్‌: హెల్మెట్‌ ధరించండి.. సీటు బెల్ట్‌ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్‌ చేయకండి అంటూ ట్రాఫిక్‌ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్‌ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్‌ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్‌ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి.

బైక్‌ నడిపే వ్యక్తి హెల్మెట్‌ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్‌ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్‌ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్‌ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్‌ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి:
రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్
‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా?

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)