amp pages | Sakshi

అమ్రాబాద్‌లో ‘పులి గర్జన’

Published on Sat, 07/17/2021 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం(ఏటీఆర్‌)లో ఉన్న పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అక్కడ పధ్నాలుగు పులులున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. ఏటీఆర్‌ పరిధిలోని కోర్‌ ఏరియాలో ఉన్న వన్యప్రాణుల వివరాలనుఅటవీశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పులులతోపాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నట్టు అటవీశాఖ గుర్తించింది. నివేదిక ప్రకారం... వన్యప్రాణుల్లో అరుదైన హానీ బాడ్జర్‌ లాంటి జంతువులు, వందలాది రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

ప్రతి ఏడాది నిర్వహించే కసరత్తులో భాగంగా స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ అండ్‌ ప్రే బేస్‌ ఇన్‌ అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ 2021 (వైల్డ్‌లైఫ్‌ సెన్సెస్‌ రిపోర్ట్‌)ను శుక్రవారం విడుదల చేశారు. నల్లమల అటవీప్రాంతమైన (2,611 చదరపు కిలోమీటర్ల పరిధి) అమ్రాబాద్‌లోని కోర్‌ ఏరియాలో పరిశీలన చేశారు. లైన్‌ ట్రాన్సిక్ట్‌ మెథడ్, వాటర్‌ హోల్‌ సెన్సస్‌ల ఆధారంగా జంతువులను లెక్కించారు. పులులతోపాటు వాటి వేటకు ఆధారమైన శాఖాహార జంతువుల లభ్యతను కూడా పరిశీలించారు. ప్రతిచదరపు కిలోమీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవిపందులు, సాంబార్, లంగూర్‌ లాంటి జంతువులను లెక్కించారు. పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని నివేదిక విడుదల సందర్భంగా పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ తెలిపారు.

తెలంగాణలో 26 పులులు 
2018లో జాతీయస్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పులుల సెన్సెస్‌ నిర్వహించగా తెలంగాణలో 26 పులులు(అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కలిపి) ఉన్నట్లు వెల్లడైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ కొత్త సెన్సెస్‌ నివేదికను కేంద్రం వెల్లడించనుంది. 2022 సెన్సెస్‌ నాటికి 32–34 దాకా పులుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
 
కీలకంగా మారిన పులుల సంరక్షణ  
అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, వన్యప్రాణులు ఇలా వివిధ అంశాలన్నీ పులుల సంఖ్య, వాటి స్వేచ్ఛాజీవనంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో పులి స్థిరనివాసంతోపాటు మనుగడ సాగించేందుకు 50 చ.కి.మీ. మేర అటవీ ప్రాంతం అవసరం. పులిపై ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో మిగతా వన్యప్రాణులు, జీవరాశులు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం కీలకంగా మారింది. మనుషుల వేలిముద్రలు, చేతిగుర్తుల మాదిరిగా ఏ రెండు పులుల చారలు, గుర్తులు ఒకేలా ఉండవు.

14 కంటే ఎక్కువగానే పులులుండొచ్చు...
‘అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో పులులు, ఇతర జంతువుల సంఖ్య పెరగడం మంచి పరిణామం. ఇక్కడ 14 పులులున్నట్టుగా తేలింది. అయితే సెన్సెస్‌ చేసే ఏటీఆర్‌ పరిధిని మరింత విస్తృతపరిస్తే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతంతో పోల్చితే వీటి సంఖ్య 12 నుంచి 14కు పెరిగింది’     
– బి.శ్రీనివాస్, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స, ఏటీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ 

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)